ఎంసీసీ అధ్యక్షుడిగా సంగక్కర

మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక క్రికెటర్‌ కుమార సంగక్కర నియమితుడయ్యాడు. క్రికెట్‌ నిబంధనల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఎంసీసీకి అధ్యక్షుడిగా పని చేయబోతున్న తొలి బ్రిటిషేతరుడు సంగక్కర. 2019 అక్టోబరు 1న బాధ్యతలు అందుకోనున్న సంగక్కర ఏడాది పాటు పదవిలో కొనసాగుతాడు. ప్రస్తుతం ఆంటోనీ రెఫార్ట్‌ ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. 2012లో ఎంసీసీ గౌరవ జీవితకాల సభ్యత్వం అందుకున్న సంగక్కర.. క్లబ్‌ ప్రపంచ క్రికెట్‌ కమిటీలోనూ భాగమయ్యాడు.

Read More

కృష్ణ పదార్థం ఉనికి నిర్ధారణ

విశ్వంలో అంతుచిక్కని కృష్ణ పదార్థం (డార్క్‌ మ్యాటర్‌) ఉనికిపై ఉన్న సందేహాలను శాస్త్రవేత్తలు పటాపంచలు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన సిద్ధాంతాలను కొట్టిపారేశారు. కృష్ణ పదార్థం ఉనికిని నిర్ధరించారు. విశ్వం విస్తరణ నుంచి గెలాక్సీల్లోని నక్షత్రాల కదలికల వరకూ అనేక అంశాల తీరుతెన్నులను సాధారణ పదార్థం వివరించడం లేదు. దీంతో గుర్తించడానికి వీల్లేని కృష్ణ పదార్థం ఉనికిపై ఒక సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. విశ్వంలోని మొత్తం పదార్థంలో దీని వాటా 90 శాతం మేర ఉంటుందని…

Read More

గూగుల్‌ బోర్డు నుంచి ష్మిట్‌ నిష్క్రమణ

గూగుల్‌ను మాజీ సీఈవో ఎరిక్‌ ష్మిట్‌ ఆ సంస్థ బోర్డు నుంచి నిష్క్రమించనున్నారు. 2019 జూన్‌లో ఆయన తప్పుకోనున్నట్లు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ వెల్లడించింది. 2018లో ఆల్ఫాబెట్‌ చైర్మన్‌ పదవి నుంచి ష్మిట్‌ తప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పటికీ .. సాంకేతిక సలహాదారు పాత్రకే పరిమితమయ్యారు. జూన్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది. ప్రముఖ వ్యాపారవేత్త, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ష్మిట్‌ను సీఈవోగా 2001లో గూగుల్‌ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ రిక్రూట్‌…

Read More