Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
HIV హైదరాబాద్‌లోనే అధికం – Success Secret

HIV హైదరాబాద్‌లోనే అధికం

దేశం మొత్తమ్మీద 2017లో కొత్తగా నమోదైన HIV కేసుల్లో అత్యధికం తెలంగాణలోనే ఉన్నాయి. ఆ ఒక్క ఏడాదిలోనే 9,324 కేసులు నమోదయ్యాయి. 2019 నవంబర్‌ 28 నాటికి రాష్ట్రంలో 83,102 మంది HIV బాధితుతులున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ(టీ సాక్స్‌) ప్రకటించింది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే… హైదరాబాద్‌లో వ్యాధిగ్రస్థులు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా టీ సాక్స్‌ గణాంకాలను వెల్లడించింది. గతంలో HIV బాధితులకు రక్తంలో సీడీ5 కణాల సంఖ్య 500 కంటే తక్కువగా ఉంటేనే ‘యాంటీ రిట్రో వైరల్‌(ఏఆర్‌టీ)’ ఔషధాలను ఇచ్చేవారు. ఇటీవల మార్చిన విధానంలో HIV సోకిందని నిర్ధరించగానే ఏఆర్‌టీ ఔషధాలు పంపిణీ చేస్తున్నారు.

H IV – Human Immunodeficiency Virus

AIDS- Acquired Immuno Deficiency Syndrome

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *