ఫ్రీ వైఫై.. జీవితాన్ని మలుపు తిప్పింది

పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు తమ చుట్టూ పుస్తకాలు వేసుకుని గంటల తరబడి కుస్తీ పట్టడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఓ యువకుడు ఫ్రీ వైఫై సాయంతో తన తలరాతను మార్చుకున్నాడు. కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాల రాత పరీక్షలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన ఓ రైల్వే కూలీ స్టోరీ ఇది. మున్నార్‌కు చెందిన శ్రీనాథ్‌ పదో తరగతి పాసయ్యాడు. కుటుంబ ఆర్థిక స్తోమత అంతగా లేకపోవటంతో చదువుకు స్వస్తి చెప్పి ఐదేళ్ల క్రితం…

Read More

కోచింగ్ లేకుండా కూడా ర్యాంకులు సాధించవచ్చు

అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు వస్తుందని అస్సలు ఊహించలేదు. లక్షల మంది ప్రతిభావంతులైన అభ్యర్థులు పోటీపడుతుంటారు. అంతమందిలో నాకు మొదటి ర్యాంకు రావడం సంతోషమే. ప్రయత్నం చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది. ‘సివిల్స్‌లో ర్యాంకు సాధించాలంటే మేధావులే (సూపర్‌ బ్రిలియంట్‌) కానక్కర్లేదు. పాఠశాల స్థాయి నుంచి నేను అంత తెలివైన వాణ్నేమీ కాదు. పదో తరగతిలో 86 శాతం మార్కులు, బీటెక్‌లో 76 శాతం మార్కులే వచ్చాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పిల్లలే సివిల్స్‌లో ర్యాంకు…

Read More

ఆటు పోట్లు ఎదురైనా .. కఠోర దీక్షతో విజయం తథ్యం

లక్ష్యం గొప్పదైతే..దాన్ని సాకారం చేసుకొనేందుకు అహరహం శ్రమిస్తే..విజయం ఎదురొచ్చి నిలుస్తుంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా కఠోర దీక్షతో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. ఇందుకు ప్రబల తార్కాణం సత్యప్రసాద్‌! చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలన్నది ఆ యువకుడి కల. అలాగని భారీ ప్రణాళికల్లేవు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంజినీరింగ్‌ వరకు చదువులన్నీ సాదా సీదాగా సాగాయి. కాని లక్ష్యాన్ని మాత్రం ఏనాడూ వీడలేదు. అదే ఐఏఎస్‌ మెట్లు ఎక్కేలా చేసింది. బుడిమజ్జి సత్యప్రసాద్‌..పుట్టింది విజయనగరం…

Read More

ఎక్కడ ఓడామో అక్కడే నెగ్గాలి

అఖిలభారత స్థాయిలో అనంత అమ్మాయి ప్రతిభతో వికసించింది. ఎక్కడ ఓడామో అక్కడే నెగ్గాలనే పట్టుదలతో శ్రమించి మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. సివిల్‌ సర్వీసు సాధించాలన్నది లక్షలాది మంది కల. ఆకల సాకారం అయ్యేది ఏ కొద్దిమందికో. కరవు సీమ నుంచి తన సత్తా చాటి సివిల్‌ సర్వీసు ర్యాంకు సొంతం చేసుకుంది. తాడిపత్రి మండలం కొండేపల్లికి చెందిన న్యాయవాది మద్దిపట్ల మనోహర్‌నాయుడు, శిశు సంక్షేమ, మహిళాభివృద్ధి శాఖ సీడీపీఓ కృష్ణకుమారి కుమార్తె ప్రసన్నకుమారి. వృత్తి రీత్యా…

Read More

సివిల్స్ సన్నద్దానికి ఉద్యోగం అడ్డు కాదు

పట్టు వదలకుండా చదివాడు.. అనుకున్నది సాధించాలనే తపనతో ముందుకెళ్లాడు. అంకితభావం, చిత్తశుద్ధితో ప్రయత్నించి సఫలమై ఆదర్శంగా నిలిచాడు. సివిల్స్‌ ఫలితాల్లో హన్మకొండకు చెందిన బిరుదరాజు రోహిత్‌ 627 ర్యాంక్‌ సాధించి భేష్‌ అనిపించుకున్నాడు. గతంలో వచ్చిన ర్యాంకుతో ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఏఎస్సై కుమారుడైన ఆయన అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే మళ్లీ సివిల్స్‌కు సన్నద్ధమై ర్యాంక్‌ సాధించారు. హన్మకొండకు చెందిన బిరుదరాజు అశోక్‌రాజు, రామలీల దంపతులు కుమారుడు రోహిత్‌. అశోక్‌రాజు స్పెషల్‌బ్రాంచ్‌లో…

Read More

ఉన్నత స్థానాన్ని సాధించాలనుకున్నపుడు కొన్నింటిని వదులుకోక తప్పదు

బాల్యంలోనే ఉన్నత ఆశయానికి బీజం.. లక్ష్య సాధనకు గంటల తరబడి సాధన.. గమ్యం చేరడానికి ఎన్నింటినో వదులుకున్నాడు.. అనారోగ్యం ‘పరీక్ష’ పెట్టినా పట్టువీడలేదు.. కదలలేని స్థితిలో ఉన్నా పరీక్షకు హాజరయ్యాడు.. 393వ ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచాడు. కామారెడ్డి జిల్లా సంయుక్త పాలనాధికారి కుమారుడు ఆదర్శ్‌ సివిల్స్‌ విజయగాథ ఇది. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన సురభి సత్తయ్య కామారెడ్డి జిల్లా సంయుక్త పాలనాధికారిగా కొనసాగుతున్నారు.ఈయన పెద్ద కుమారుడు ఆదర్శ్‌ రెండు రోజుల కిందట విడుదలైన సివిల్స్‌లో…

Read More

పట్టుదలే పెట్టుబడి

‘కలలు కనండి.. వాటి సాకారానికి నిరంతరం శ్రమించండి’ అన్న అబ్దుల్‌కలాం మాటలను నిజం చేశాడు ఆ యువకుడు. మనసులో మెరిసిన తన ఆలోచనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, మిత్రుల సహకారం తోడవ్వడంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. పట్టుదలే పెట్టుబడిగా నిరంతరం శ్రమిస్తూ కలను సాకారం చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామానికి చెందిన శీలం సాయితేజ సివిల్స్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 43వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచాడు. చదివింది ఇంజినీరింగు…

Read More

సగటు విద్యార్థులకూ సివిల్స్ లో విజయం సాధ్యమే

‘సివిల్‌ సర్వీస్‌ విజేతలందరూ ఐఐటీ, బిట్స్‌ పిలానీ, ఎయిమ్స్‌లో చదివిన వారే ఉంటారన్నది అపోహ మాత్రమే. గ్రామీణ ప్రాంతాలకు చెందిన సగటు విద్యార్థులూ సివిల్స్‌లో విజయం సాధించవచ్చు’ అని సివిల్స్‌ 245వ ర్యాంకర్‌ గురజాల చందీష్‌ అన్నారు. కాకపోతే ఒకసారి విజయం దక్కకున్నా నిరాశ చెందకుండా…నిరంతర కృషి చేయాల్సి ఉంటుందన్నారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసుకు ఎంపికై ప్రస్తుతం దిల్లీలో శిక్షణ పొందుతున్న 23 ఏళ్ల చందీష్‌ రెండో ప్రయత్నంలో 245వ…

Read More

అంకిత భావంతో కూడిన కృషితోనే లక్ష్యసాధన

తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన మాధురి సివిల్స్‌లో 144వ ర్యాంకు సాధించారు. మారుమూల గ్రామం పేరు జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. మాధురి తల్లిదండ్రులు గడ్డం మురళీధర్‌, శారద దంపతులు ఉద్యోగ నిమిత్తం హైదరాబాదులో స్థిరపడ్డారు. మురళీధర్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రూ.20 లక్షల జీతం కాదనుకుని మాధురి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. జేఈఈ మెయిన్స్‌లో 790 ర్యాంకు సాధించి గచ్చిబౌలిలోని ఐఐటీ…

Read More
Pruthvi teja

సాంసంగ్‌ కంపెనీలో ఉద్యోగం వదిలి..సివిల్స్ వైపు కదిలి

ఐఐటీ-2011లో ఇండియా టాపర్‌గా నిలిచా. ముంబయి ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక దక్షిణ కొరియాలోని సాంసంగ్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వార్షిక వేతనం రూ.కోటి. అక్కడికి వెళ్లాక ఏదో వెలితి. ఏడాది పాటు పనిచేశాక తిరుగుటపాకట్టా. మరో ఏడాది శ్రమించి తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించా’నని సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించిన ఇమ్మిడి పృథ్వీతేజ అన్నారు. కుటుంబ నేపథ్యం మాది పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల. తండ్రి పేరు శ్రీనివాసరావు. స్వగ్రామంలో బంగారు దుకాణం. తల్లి గృహిణి. ‘‘నువ్వు…

Read More