వికీలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు అసాంజ్‌కు ఏడాది జైలు

బెయిల్‌ షరతులను ఉల్లంఘించినందుకుగాను వికీలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌కు యూకేలోని ఓ న్యాయస్థానం 2019 మే 1న 50 వారాల జైలుశిక్ష విధించింది. యూకే బెయిల్‌ చట్టాన్ని అతను ఉల్లంఘించినట్లు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తేల్చింది. గతంలో రహస్య పత్రాలను బహిర్గతం చేసిన వ్యవహారంలో తనను అమెరికాకు అప్పగించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అసాంజ్‌ ఏడేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాయలంలోనే ఆశ్రయం పొందారు. ఈక్వెడార్‌ ప్రభుత్వం అసాంజ్‌కు ఆశ్రయాన్ని ఉపసంహరించడంతో ఇటీవల అధికారులు అతన్ని…

Read More

జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తొలి ఛైర్మన్‌గా, లోకాయుక్తగా సేవలు అందించిన జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి 2019 మే 1న హైదరాబాద్‌లో మృతిచెందారు. జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి హైదరాబాద్‌లోని బాగ్‌అంబర్‌పేటలో భూస్వామి ఆగారెడ్డి, శకుంతలాదేవి దంపతులకు 1943 మార్చి 2న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, తర్వాత న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ముగ్గురు కుమారుల్లో చంద్రసేన్‌రెడ్డి, విజయసేనారెడ్డిలు న్యాయవాదులు. మూడో కుమారుడు ఇంద్రసేన్‌రెడ్డి…

Read More

అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్‌ అజార్‌

పాకిస్థాన్‌ ప్రేరేపిత జైష్‌ ఎ మహ్మద్‌ అధిపతి మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిని నిషేధ జాబితాలో చేర్చే అంశంపై పదేళ్లుగా అడ్డుపడుతూ వచ్చిన చైనా అంతర్జాతీయ ఒత్తిడితో తన వైఖరిని మార్చుకోవడంతో ఇందుకు మార్గం సుగమమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయం వల్ల అన్ని దేశాలూ తక్షణం అజార్‌, అతడి సంస్థ ఆస్తులు, ఆర్థిక వనరులను స్తంభింపచేయాల్సి ఉంటుంది. ఆయుధ విక్రయాలు చేపట్టకూడదు. అతడి ప్రయాణాలపై నిషేధం విధించాల్సి ఉంటుంది. ఐక్యరాజ్యసమితి తీర్మానంలో…

Read More

గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మందుపాతర పేలి 16 మంది మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టు 2019 మే 1న ప్రైవేటు వాహనంలో వస్తున్న పోలీసు బలగాలే లక్ష్యంగా శక్తిమంతమైన మందుపాతరను పేల్చిన ఘటనలో సి-60 కమాండోలు 16 మంది మృతి చెందారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే మావోయిస్టు ఈ దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని గడ్చిరోలి అడవి మవోయిస్టు ప్రాబల్య ప్రాంతం. సి-60 కమాండోలు.. సాధారణంగా మావోయిస్టు వ్యతిరేక చర్యలో పాల్గొనేందుకు శిక్షణ పొందిన దళాలన్నీ రాష్ట్రస్థాయి బగాలు అయి ఉంటాయి. సి-60…

Read More

వెనెజువెలాలో సంక్షోభం

వెనెజువెలా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. అధ్యక్షుడు నికోలస్‌ మడురోకు వ్యతిరేకంగా తిరగబడాలని అమెరికా మద్దతున్న విపక్ష నాయకుడు జువాన్‌ గ్వాడో దేశ సైన్యానికి పిల పునివ్వడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రాజధాని కరాకాస్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని గ్వాడో సూచనలకు అనుగుణంగా ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కఠినంగా వ్యవహరించాలని మడురో తన బలగాలను ఆదేశించడంతో సైన్యం కాల్పులు, బాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులతో ఆందోళనకారులను చెదరగొట్టింది. అమెరికా…

Read More

ఎంసీసీ అధ్యక్షుడిగా సంగక్కర

మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక క్రికెటర్‌ కుమార సంగక్కర నియమితుడయ్యాడు. క్రికెట్‌ నిబంధనల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఎంసీసీకి అధ్యక్షుడిగా పని చేయబోతున్న తొలి బ్రిటిషేతరుడు సంగక్కర. 2019 అక్టోబరు 1న బాధ్యతలు అందుకోనున్న సంగక్కర ఏడాది పాటు పదవిలో కొనసాగుతాడు. ప్రస్తుతం ఆంటోనీ రెఫార్ట్‌ ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. 2012లో ఎంసీసీ గౌరవ జీవితకాల సభ్యత్వం అందుకున్న సంగక్కర.. క్లబ్‌ ప్రపంచ క్రికెట్‌ కమిటీలోనూ భాగమయ్యాడు.

Read More

కృష్ణ పదార్థం ఉనికి నిర్ధారణ

విశ్వంలో అంతుచిక్కని కృష్ణ పదార్థం (డార్క్‌ మ్యాటర్‌) ఉనికిపై ఉన్న సందేహాలను శాస్త్రవేత్తలు పటాపంచలు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన సిద్ధాంతాలను కొట్టిపారేశారు. కృష్ణ పదార్థం ఉనికిని నిర్ధరించారు. విశ్వం విస్తరణ నుంచి గెలాక్సీల్లోని నక్షత్రాల కదలికల వరకూ అనేక అంశాల తీరుతెన్నులను సాధారణ పదార్థం వివరించడం లేదు. దీంతో గుర్తించడానికి వీల్లేని కృష్ణ పదార్థం ఉనికిపై ఒక సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. విశ్వంలోని మొత్తం పదార్థంలో దీని వాటా 90 శాతం మేర ఉంటుందని…

Read More