Current Affairs

కొవిడ్‌ నుంచి కోలుకొన్న వారిలో తీవ్రమైన మెడనొప్పి వస్తున్నట్లు ఇటలీలోని ‘యూనివర్సిటీ హాస్పిటల్‌ ఆఫ్‌ పీసా’ వైద్యులు గుర్తించారు. దీన్ని ‘సబ్‌అక్యూట్‌ థైరాయిడిటిస్‌’గా వ్యవహరిస్తారు. కొన్నాళ్ల కిందట ఇటలీలో ఒక యువతికి కరోనా సోకడంతో చికిత్స తీసుకొని కొలుకొంది. ఇంటికి వెళ్లాక ఆమెకు మెడ, థైరాయిడ్‌ గ్రంథి వద్ద తీవ్రమైన నొప్పి మొదలైంది. దీనికి తోడు జ్వరం కూడా రావడంతో వైద్యులను ఆశ్రయించింది. ఆమెకు సబ్‌అక్యూట్‌ థైరాయిడిటిస్‌ సమస్య, జ్వరం ...
Read More
జాతీయ హరిత న్యాయస్థానం(NGT) ఆదేశా మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఎస్‌.డి.ముఖర్జీతో పాటు కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఇంజినీర్‌ బీవీ భద్రగిరీశ్‌ ఉన్నారు ...
Read More
ప్రముఖ నాస్తికోద్యమ నాయకుడు, విజయవాడ నాస్తిక కేంద్రం కార్యనిర్వాహక సంచాలకుడు, సాంఘికోద్యమ నేత, పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ జి.విజయం(84) విజయవాడలో 2020 మే 22న మృతి చెందాడు. నాస్తిక కేంద్ర వ్యవస్థాపకుడు, ప్రపంచ నాస్తికోద్యమ నేతు గోరా, సరస్వతిలకు విజయం ద్వితీయ కుమారుడు. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సమరం, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్యకు సోదరుడు. విజయం భార్య గతంలోనే మృతిచెందారు. మచిలీపట్నంలో జన్మించిన విజయం స్థానిక పాఠశాలతో పాటు ...
Read More
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కల్యాణ మండపాలు తదితర ఆన్‌లైన్‌ సేవలతో పాటు ఈ-డొనేషన్స్‌ సౌకర్యార్థం TTD నూతన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా మార్పు చేసినట్లు వెల్లడించింది. ఇది 2020 మే 23 నుంచి అమల్లోకి వచ్చింది. TTD పేరుతో పుట్టుకొచ్చిన నకిలీ వెబ్‌సైట్‌ ల వల్ల భక్తులు మోసపోకుండా కొత్తది రూపొందించినట్లు TTD వివరించింది. కొత్తగా రూపొందించిన tirupatibalaji.ap.gov.in ...
Read More
తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు నాగార్జునసాగర్‌ కుడి కాలువకు నీరు విడుదల చేయనుంది. తాగునీటి అవసరాలకు రెండు టీఎంసీల నీరు అవసరమన్న ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తిపై 2020 మే 22న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు మురళీధర్‌, నారాయణరెడ్డి, బోర్డు ...
Read More
అంపన్‌ తుపాను కారణంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాకు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2020 పశీ 22న ఆయన ఆ రెండు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. తక్షణ సాయం కింద పశ్చిమ బెంగాల్‌కు రూ.1000 కోట్లు, ఒడిశాకు రూ.500 కోట్లు చొప్పున మొత్తం రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ...
Read More
హాంకాంగ్‌ను మరింతగా తన ఉక్కు పిడికిలిలో బిగించేందుకు వివాదాస్పద ‘జాతీయ భద్రతా చట్టం’ ముసాయిదాను చైనా 2020 మే 22న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ చట్టం వల్ల హాంకాంగ్‌ ప్రాదేశిక స్వయంప్రతిపత్తి, ప్రజ వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్ర నష్టం వాట్లిుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రజాస్వామ్య అనుకూలవాదులు, వేర్పాటువాదులపై కొరడా ఝుళిపించడానికే దీన్ని తెస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రబల ఆర్థిక శక్తి అయిన హాంకాంగ్‌ ప్రస్తుతం చైనాలో ప్రత్యేక పాలనా వ్యవస్థ(ఎస్‌ఏఆర్‌)గా ...
Read More
హైదరాబాద్‌లో 2020 మే 22న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు 45 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, పలువురు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం వెంగళరావునగర్‌ డివిజన్‌లోని యాదగిరినగర్‌, ఎర్రగడ్డ డివిజన్‌ సుల్తాన్‌నగర్‌ కమ్యూనిటీహాళ్లలో నిర్మించిన బస్తీ దవాఖానాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు ...
Read More
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక రేట్లలో కోత విధించింది. రెపో రేటును మరో 40 బేసిస్‌ పాయింట్లను తగ్గించి 4 శాతానికి పరిమితం చేసింది. 2000 సంవత్సరం తర్వాత ఇది ఈ స్థాయికి చేరడం ఇప్పుడే. రివర్‌ రెపో రేటును సైతం 3.75% నుంచి 3.35 శాతానికి చేరుస్తూ 2020 మే 22న జరిగిన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన, ...
Read More
పాకిస్థాన్‌లో 2020 మే 22న ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచీలోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 99 మందితో వస్తున్న పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో అనేకమంది మృతి చెందారు. లాహోర్‌ నుంచి బయుదేరిన పీకే-8303 అనే ఈ విమానం కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ల్యాండిరగ్‌కు ఒక నిమిషం ముందు విమానాశ్రయానికి సమీపంలోని జిన్నా హౌసింగ్‌ సొసైటీపై కూలి ...
Read More

 17 total views,  1 views today

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.