ఇరాన్‌ రెజ్లర్ నవీద్‌ అఫ్కారీకి మరణ శిక్ష

ఇరాన్‌ రెజ్లర్‌ నవీద్‌ అఫ్కారీకి ఆ దేశ ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌ 12న మరణశిక్ష అమలు చేసింది. 2018లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లలో ఒక గార్డును కత్తితో పొడిచి చంపాడన్న అభియోగంపై నవీద్‌కు ఇరాన్‌ ప్రభుత్వం ఈ శిక్ష విధించింది. 27 ఏళ్ల అఫ్కారీకి రెండు కోర్టులు ఉరిశిక్ష నిర్ధారించాయని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ సెప్టెంబర్‌ 13న వెల్లడించింది. ఆ క్రీడాకారుడి చర్య ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవడమేనని పేర్కొన్న ఓ క్రిమినల్‌ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. నవీద్‌కు ఉరిశిక్ష అమలు చేయడంపై ఆ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నవీద్‌కు మరణశిక్ష విధించవద్దని వివిధ దేశాలకు చెందిన 85వేల మంది అథ్లెట్లతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విన్నవించినా ఇరాన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇరాన్‌ ప్రభుత్వ చర్యను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఖండించింది.

 11 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.