TTD నూతన వెబ్‌సైట్‌ https:/tirupatibalaji.ap.gov.in

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కల్యాణ మండపాలు తదితర ఆన్‌లైన్‌ సేవలతో పాటు ఈ-డొనేషన్స్‌ సౌకర్యార్థం TTD నూతన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా మార్పు చేసినట్లు వెల్లడించింది. ఇది 2020 మే 23 నుంచి అమల్లోకి వచ్చింది.

  • TTD పేరుతో పుట్టుకొచ్చిన నకిలీ వెబ్‌సైట్‌ ల వల్ల భక్తులు మోసపోకుండా కొత్తది రూపొందించినట్లు TTD వివరించింది.
  • కొత్తగా రూపొందించిన tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో తిరుపతి, బాలాజీ, ఏపీ.గవ్‌..పదాల కూర్పుపై వివరణ ఇస్తూ.. ‘ఉత్తరాది రాష్ట్రాల వారు శ్రీవేంకటేశ్వర స్వామిని బాలాజీ పేరుతో కొలుస్తారు.
  • దక్షిణాది రాష్ట్రాల వారు తిరుపతి యాత్రగా పిలుస్తారు. ఈ రెండు పదాలతోనే గూగుల్‌లో సెర్చి చేయడం ద్వారా నకిలీ వెబ్‌సైట్ల బారిన పడుతున్నారు. కొత్త వెబ్‌సైట్‌లో ఈ రెండు పదాలను చేర్చినందున అధికారిక సైట్‌ ఓపెన్‌ అవుతుంది.
  • కేవలం డొమైన్‌లో తప్ప అప్లికేషన్స్‌లో మార్పు చేయలేదు. ap.gov.in అనేది రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ పరిధిలోకి వస్తుంది. ap.gov.in పేరుతో నకిలీ వెబ్‌సైట్లు తీసుకురావడం అంత సులువు కాదని పేర్కొంది.

 42 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.