కంటెయిన్‌మెంట్‌ జోన్లలోని పోలీసులు, పారామిటరీ సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్లు

కరోనా వైరస్‌ సోకకుండా వైద్య సిబ్బంది ముందు జాగ్రత్తగా తీసుకుంటున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్లను కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పనిచేసే పోలీసులు, పారామిటరీ సిబ్బందికి కూడా ఇవ్వాలని ICMR R సిఫార్సు చేసింది. ఎయిమ్స్‌, NCDC, NDMA, WHO ప్రతినిధులతో కలిసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ప్రభావంపై అధ్యయనం చేసిన అనంతరం ICMR ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ దీని వినియోగంపై సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మాత్రలు తీసుకుంటున్న వైద్యసిబ్బందిలో దుష్పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ వైరస్‌ సంక్రమణ విషయంలో అది చెప్పుకోదగ్గ స్థాయిలోనే పనిచేస్తున్నట్లు ICMR పేర్కొంది.

  • రెటినోపతి, హైపర్‌ సెన్సిటివిటీ, జీ6పీడీ డెఫిషియన్సీ, ముందస్తు గుండె సంబంధ సమస్యలున్నవారికి మాత్రం ఈ మాత్రలు ఇవ్వకూడదని ICMR స్పష్టంచేసింది.
  • 15 ఏళ్లలోపు పిల్లలకు, గర్భిణిలు, బాలింతలకు ఇవ్వొద్దని పేర్కొంది. అరుదుగా గుండె సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అలాంటి సమయంలో దీన్ని మానేయాలని చెప్పింది. కొన్నిసార్లు చూపు మసకబారే అవకాశం కూడా ఉంటుందని, అలాంటి సమయంలోనూ నిలిపేయాలని పేర్కొంది.

 57 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.