కొవిడ్‌- 19 టీకా అభివృద్ధికి థామస్‌ జెఫర్సన్‌ యూనివర్సిటీతో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం

కొవిడ్‌-19 వ్యాధికి టీకా అభివృద్ధి చేయటంలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌.. యూఎస్‌ఏలోని ఫిల్‌డెల్ఫియాలో ఉన్న థామస్‌ జెఫర్సన్‌ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఇనాక్టివేటెడ్‌ రెబీస్‌ వెక్టార్‌ ప్లాట్‌ఫామ్‌’ను ఉపయోగించి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయటానికి యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది.

  • ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటమే కాకుండా యూఎస్‌, ఐరోపా, జపాన్‌ తదితర దేశాల్లో విక్రయించే హక్కులు లభిస్తాయి.
  • ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో 25 శాతం ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ ప్లాట్‌ఫామ్‌ను కేరియర్‌ లేదా వెక్టార్‌గా ఉపయోగించుకుంటున్నాయి.
  • దీనివల్ల త్వరితంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటానికి, మెరుగైన ఫలితాలు సాధించటానికి వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
  • భారత్‌ బయోటెక్‌ పరిశోధకులు కూడా ఇదేవిధంగా ‘డీయాక్టివేటెడ్‌ రెబీస్‌ వ్యాక్సిన్‌’ను వెక్టార్‌గా వినియోగిస్తున్నారు.
  • 2020 డిసెంబరు నాటికి వ్యాక్సిన్‌ను క్లినికల్‌ పరీక్షల దశకు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

 33 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.