సూయ..సూయ..సూయ

నా జీవితం నా ఇష్టం..నువ్వేవ్వారు నాకు చెప్పడానికి..? అంటూ బుల్లితెర యాంకర్‌ అనసూయ ఇప్పటికే వార్తల్లో నిలిచింది. తన పట్ల కామెంట్లు చేసే వారికి గట్టిగానే సమాధానం చెబుతూ వస్తోన్న అనసూయ ఇటీవల సోషల్ మీడియా లో చేసిన లైవ్ లో తన డ్రెస్సింగ్ గురించి కామెంట్‌ చేసిన ఓ అభిమానిపై లైవ్‌లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. నా డ్రెస్సింగ్‌ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరివి అంటూ గట్టిగానే ప్రశ్నించారు. ఇటీవల తన పుట్టినరోజు పురస్కరించుకుని అనసూయ కుటుంబంతో కలిసి కొంత సమయం ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్లతో ముచ్చటించారు. తన ఇష్టాయిష్టాలను అభిమానులతో పంచుకున్నారు. ఇంతలో ఓ నెటిజన్‌ అనసూయను ఏకవచనంలో సంభోదించడంతో ఆమె కొంచెం అసహనానికి లోనయ్యారు. ‘మనకి తెలియని వ్యక్తిని ఎప్పుడూ ఏకవచనంలో సంభోదించకూడదు. వాళ్లకి గౌరవమివ్వాలి. నువ్వు కాదు మీరు అని పిలవడం నేర్చుకోండి. మనకి బాగా దగ్గరైన, ప్రియమైన వారిని మాత్రమే ఏకవచనంలో పిలవాలి’ అని తెలిపారు. అనంతరం ఇంకో నెటిజన్‌.. ‘మంచి డ్రెస్‌ వేసుకోండి. మీరు ఇద్దరు పిల్లలకి తల్లి అని మర్చిపోకండి’ అని కామెంట్‌ పెట్టాడు. దీంతో అనసూయ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా డ్రెస్‌ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరివి అసలు. నీకసలు అమ్మతనం అంటే తెలుసా? ఓ తల్లి ఎలా ఉండాలో, ఏ దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడానికి నువ్వు ఎవరు? ఇది ఒక అమ్మ జీవితం. తాను కోరుకున్న విధంగా జీవించే హక్కు తనకి ఉంది. నాకు నచ్చినట్టు, అందంగా కనిపించేటట్టు నేను దుస్తులు వేసుకుంటా.’ అని అనసూయ ఘాటుగా సమాధానం చెప్పారు.

 37 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.