సానియామీర్జాకు ఫెడ్‌ కప్‌ అవార్డు

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఫెడ్‌ కప్‌ హార్ట్‌ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు నెగ్గిన భారత తొలి క్రీడాకారిణిగా సానియా ఘనత సాధించింది.

  • 2020 మే నెల 1 నుంచి వారం రోజుల పాటు జరిగిన ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో 16,985 మంది పాల్గొన్నారు. 10,000 పైచిలుకు ఓట్ల (60 శాతానికి పైగా)తో ఆసియా-ఓసియానియా జోన్‌ నుంచి సానియా విజేతగా నిలిచింది.
  • 2000 అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ.1.50 లక్షలు) నగదు బహుమతి ఆమె సొంతమైంది.
  • ఈ అవార్డు ద్వారా లభించే నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేస్తానని సానియా తెలిపింది.
  • ఫెడ్‌ కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ సత్తాచాటే క్రీడాకారిణులకు గుర్తింపుగా అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య(ITF) 2009లో ఈ అవార్డును ప్రారంభించింది.

ITF-International Tennis Federation
Headquarters: London, United Kingdom
Founded: 1 March 1913
Type of business: Federation of national associations

 40 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.