లైంగిక వేధింపు కేసుల్లో బాధితుల పేర్లను వెల్లడించరాదు

అత్యాచారం, లైంగిక వేధింపుల వంటి కేసుల్లో బాధితులతో పాటు వారి తల్లిదండ్రుల పేర్లను వెల్లడించకుండా పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ డీజీపీకి హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులను గుర్తించేలా సమాచారాన్ని బహిరంగ పరచరాదంటూ నిపుణ్‌ సక్సేనా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది.

  • ఈ మార్గదర్శకాలను సంస్థలు, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రింట్‌, ఎక్ట్రానిక్‌ మీడియాలు కచ్చితంగా అమలు చేసేలా చూడాలని ఆదేశించింది.
  • ఇలాంటి కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు, రిమాండ్‌ నివేదిక, అభియోగ పత్రాల్లో పేర్లను వెల్లడించరాదని, వాటిని అవసరమైతే సీల్డ్‌ కవర్‌లో సంబంధిత ప్రత్యేక న్యాయస్థానానికి అందజేసేలా దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలంటూ డీజీపీకి స్పష్టం చేసింది.
  • లైంగిక వేధింపులపై క్రిమినల్‌ కేసు ఉన్నందున శాఖాపరమైన విచారణను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని హైదరాబాద్‌లోని అటమిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీలో ప్రిన్సిపల్‌గా పనిచేసిన కేదార్‌నాథ్‌ మహాపాత్ర హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

 38 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.