కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై పరిశీలన కమిటీ

జమ్మూ-కశ్మీర్‌లో 4జీ సేవల నియంత్రణకు సంబంధించిన అంశాల పరిశీలనకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేస్తూ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలన్నింటినీ ఈ కమిటీ పరిశీలించి ఇదివరకు అనూరాధ భాసిన్‌ కేసులో జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కశ్మీర్‌లో టెలికాం సేవలపై విధించిన నియంత్రణ వల్ల ఆ ప్రాంత ప్రజలు విద్యాహక్కు, ఆరోగ్య హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడినందున తక్షణం వాటిని పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరుతూ వివిధ సంఘాలు, ఒక న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి ధర్మాసనం వాదనలు విని రిజర్వ్‌ చేసిన తీర్పును 2020 మే 11న వెలువరించింది.

 36 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.