భారత మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ చునీ గోస్వామి మృతి

భారత మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ చునీ గోస్వామి(82) కోల్‌కతాలో 2020 ఏప్రిల్‌ 30న మృతి చెందారు.

  • చునీ గోస్వామి సారథ్యంలోని జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 1964 ఆసియా కప్‌లో రజతం గెలిచింది. ఇప్పటికీ ఈ రెండు టోర్నీల్లో భారత్‌ది ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
  • ఉమ్మడి బెంగాల్‌లో జన్మించిన గోస్వామి 1956 నుంచి 1964 మధ్య కాలంలో 50 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 13 గోల్స్‌ చేశాడు.
  • 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో దేశం తరపున ప్రాతినిథ్యం వహించాడు. 1962లో అతను ఆసియా ఉత్తమ స్ట్రైకర్‌ అవార్డు అందుకున్నాడు.
  • భారత ప్రభుత్వం చునీ గోస్వామిని అర్జున అవార్డు(1963), పద్మశ్రీ(1983) పురస్కారాలతో గౌరవించింది.
  • గోస్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని 2020 జనవరిలో భారత పోస్టల్‌ విభాగం ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.
  • 1968లో ఆటకు వీడ్కోలు పలికేంత వరకూ చునీ గోస్వామి మోహన్‌ బగాన్‌ క్లబ్‌ తరపున మాత్రమే ఆడాడు.
  • గోస్వామికి క్రికెట్‌లో కూడా ప్రవేశం ఉంది.

 27 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.