ఉన్నావ్‌ కేసులో ఎమ్మెల్యే సెంగార్‌ దోషి

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఉన్నావ్‌ అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కులదీప్‌సింగ్‌ సెంగార్‌(53) దోషి అని దిల్లీ జిల్లా జడ్జి 2019 డిసెంబర్‌ 16న తీర్పు ఇచ్చారు. ఏ మేరకు శిక్ష విధించాలనే విషయమై వాదోపవాదాలు జరగనున్నాయి. నేరాల తీవ్రత ప్రకారం చూస్తే జీవితకాల శిక్ష పడే అవకాశం ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బంగర్‌మవూ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సెంగార్‌ బీజేపీ తరఫున ఎన్నికకాగా, 2019 ఆగస్టులో ఆయన పార్టీ నుంచి బహిష్కతులయ్యారు. ఆయన ఆ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. ఈ కేసులో మరో నిందితురాలైన శశిసింగ్‌ నిర్దోషి అని జడ్జి ప్రకటించారు.

కేసు పూర్వపరాలు

ఉద్యోగం కావాలంటూ వెళ్లిన 17 ఏళ్ల మైనర్‌ బాలికపై 2017 జూన్‌ 4 బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌సింగ్‌ సెంగార్‌ అత్యాచారం చేసినట్టు ఆరోపణ వచ్చింది. 2018 ఏప్రిల్‌ 3న బాధితురాలి తండ్రిపై కొందరు వ్యక్తులుదాడి చేయడంతో పాటు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై తప్పుడు కేసులో ఇరికించారు. సెంగార్‌పై కేసులు నమోదు చేయకపోవడంతో ఏప్రిల్‌ 8న ఆమె, కుటుంబ సభ్యులతో లఖ్‌నవూ వెళ్లి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నివాసం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. మరుసటి రోజునే పోలీసు కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి మరణించాడు. చివరకు ఏప్రిల్‌ 13న సెంగార్‌ను అరెస్టు చేశారు. జులై 28న విచారణ నిమిత్తం బాధితురాలు కారులో కోర్టుకు వెళ్తుండగా, నంబరులేని లారీ దాన్ని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న బాధితురాలికి బంధువులైన ఇద్దరు మహిళలు మతి చెందగా, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయికి బాధితురాలు లేఖ రాశారు. దాంతో కేసులను లఖ్‌నవూ నుంచి దిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 38 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.