మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన మొదలైంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవకాశం లేదని పేర్కొంటూ గవర్నర్‌ పంపిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం అక్కడి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచింది. ప్రభుత్వ ఏర్పాటుకోసం 2019 నవంబర్ 12 రాత్రి 8.30 వరకు ఎన్‌సీపీకి సమయం ఇచ్చిన గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ.. మధ్యాహ్నం 12 గంటలకే కేంద్ర ప్రభుత్వానికి 18 పేజీల నివేదిక పంపించారు. కేంద్ర కేబినెట్‌ సమావేశమై ఆయన నివేదిక ఆధారంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సూచిస్తూ దస్త్రాన్ని రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దానికి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి పాలన 6 నెలలపాటు సాగేందుకు రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉంది.

 38 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.