సగటు విద్యార్థులకూ సివిల్స్ లో విజయం సాధ్యమే

‘సివిల్‌ సర్వీస్‌ విజేతలందరూ ఐఐటీ, బిట్స్‌ పిలానీ, ఎయిమ్స్‌లో చదివిన వారే ఉంటారన్నది అపోహ మాత్రమే. గ్రామీణ ప్రాంతాలకు చెందిన సగటు విద్యార్థులూ సివిల్స్‌లో విజయం సాధించవచ్చు’ అని సివిల్స్‌ 245వ ర్యాంకర్‌ గురజాల చందీష్‌ అన్నారు. కాకపోతే ఒకసారి విజయం దక్కకున్నా నిరాశ చెందకుండా…నిరంతర కృషి చేయాల్సి ఉంటుందన్నారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసుకు ఎంపికై ప్రస్తుతం దిల్లీలో శిక్షణ పొందుతున్న 23 ఏళ్ల చందీష్‌ రెండో ప్రయత్నంలో 245వ ర్యాంకు సాధించారు. శనివారం ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘సివిల్స్‌లో విజేతగా నిలిచే వారందరూ ప్రతిభావంతులేం కాదు. సాధారణ విద్యాసంస్థల్లో చదివిన సగటు విద్యార్థులూ ఎందరో ఉంటున్నారు. ఐతే ఒకసారి రాసి విజయం దక్కలేదని వదిలేయకూడదు. పట్టువదలకుండా చివరి వరకు ప్రయత్నించాలి. నాకు మొదటి నుంచి జీవశాస్త్రం అంటే ఆసక్తి. అంతేకాదు గిరిజనుల సమస్యలు తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉండేది. ఆంత్రోపాలజీలో జీవశాస్త్రానికి సంబంధించిన అంశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఆంత్రోపాలజీనీ ఐచ్ఛికాంశంగా ఎంచుకున్నా. ప్రతి ఒక్కరూ చదివే పుస్తకాలు దాదాపు ఒకటే. కాకపోతే సొంతగా నోట్సు రాసుకోవాలి. అది కూడా క్రమపద్ధతిలో సాగాలి. వేగంగా జవాబులు రాసేలా సాధన చేయాలి. ఇలా శిక్షణ సాగితే ఎవరైనా సివిల్స్ విజేతలు కావొచ్చు.’ అన్నారు.
కుటుంబ నేపథ్యం
చందీష్‌ తండ్రిది చిత్తూరు జిల్లా ఐరాల మండలం అడపగుండ్ల గ్రామం. తండ్రి పూర్ణచంద్రరావు ఏపీ నీటి వనరుల విభాగంలో డిప్యూటీ ఇంజినీరు. ప్రస్తుతం ఆయన కర్నూల్‌లో పనిచేస్తున్నారు. తల్లి జయసుధ గృహిణి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసముంటున్నారు. తమ్ముడు దిల్లీలోని శివనాడార్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
బిట్స్‌ పిలానీ నుంచి సివిల్స్‌ వైపు
* 10వ తరగతి వరకు తిరుపతి, హైదరాబాద్‌ భారతీయ విద్యా భవన్‌లో(94 శాతం)
* ఇంటర్‌మీడియట్‌ ఎంపీసీ హైదరాబాద్‌లో ఫిడ్జి కళాశాలలో(95శాతం)
* బిట్స్‌ పిలానీ క్యాంపస్‌లో 2015లో బీటెక్‌ (మెకానికల్‌) పూర్తి
* తొలిసారి 2016లో సివిల్స్‌కు హాజరు

 37 total views,  1 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.