Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
25వ ప్రపంచ పర్యావరణ సదస్సు ముగింపు – Success Secret

25వ ప్రపంచ పర్యావరణ సదస్సు ముగింపు

దాదాపు 200 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులతో స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన 25వ ప్రపంచ పర్యావరణ సదస్సు(కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌-కాప్‌ 25) ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది. 2019 డిసెంబర్‌ 2 నుంచి 13 వరకూ జరగాల్సిన సమావేశాల్లో ఫలితం తేలకపోవడంతో డిసెంబర్‌ 15 వరకూ పొడిగించారు. అయినప్పటికీ కర్బన ఉద్గారాల తగ్గింపుపై 2015 పారిస్‌ ఒప్పందం చేసిన సూచనలను అమలు చేసే దిశగా అడుగులు పడలేదు. 2020 ఏడాది స్కాట్లాండ్‌ (గ్లాస్గో)లో జరగనున్న సీఓపీ26 సదస్సులో వాటిని చర్చించాలని నిర్ణయించారు. సదస్సులో పలు అంశాలు చర్చకు వచ్చినప్పటికీ ఎటువంటి అంగీకారం కుదరలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!