Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం – Success Secret

మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. మాదిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కొమ్మూరి కనకారావు, మాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పెదపాటి అమ్మాజీ, రెల్లి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా వి.మధుసూదన్‌రావును నియమిస్తూ 2019 డిసెంబర్‌ 4న వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్ల కార్యకలాపాలు నిర్వహించేందుకు 16 మంది చొప్పున సభ్యులతో 3 వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆయా కార్పొరేషన్‌ ఛైర్మన్‌, సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు, ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ, సహకార శాఖ కమిషనర్‌, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సంచాలకులు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ ఎండీ, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి, భూగర్భ జలాల సంచాలకులు, ఏపీఎస్‌ఐడీవో ఎండీ, ట్రాన్స్‌ కో ఎండీ, వ్యవసాయశాఖ కమిషనర్‌, ఉద్యానశాఖ కమిషనర్‌, లిడ్‌క్యాప్‌ ఎండీ, జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌. కమిటీల్లో ప్రభుత్వం నియమించిన సభ్యులు లేదా వారి ప్రతినిధులు పాల్గొనవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!