నెల్లూరు చిత్రకారుడికి 10 ప్రపంచ రికార్డులు

నెల్లూరుకు చెందిన చిత్రకారుడు షేక్‌ అమీర్‌జాన్‌ అరుదైన రికార్డును నెలకొల్పారు. విభిన్న చిత్రాలను చిత్రించి మిరాకిల్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ నుంచి 10 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 22న ఆయన నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్‌, 25 కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా మిరాకిల్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ పంపిన ధ్రువపత్రాలతో పాటు బంగారు పతకాన్ని అందుకున్నారు. పండ్ల రసాలతో 966 అడుగుల అబ్దుల్‌కలాం చిత్రం, శంఖంపై చిత్రించిన 555 సూక్ష్మ వినాయకుడి చిత్రాల నమూనా, గోటిపై సరిపోయే అతిచిన్న 20 ఎక్కాల పుస్తకం, బియ్యపు గింజపై ప్రపంచ క్రికెట్‌ కప్పు, గాంధీ దండియాత్ర చిత్రాలు అతి చిన్నవి మూడు, చింత ఆకుపై 108 సూక్ష్మ వినాయకుడి చిత్రాలు, బాల్‌పాయింట్‌ పెన్ను లోపల వినాయకుడి చిత్రాలు, కాలపరిమితి తీరిన మాత్రలతో రంగులను తయారు చేసుకుని గాంధీ చిత్రం, మానవ పరిణామ క్రమాన్ని తెలియజేసే 512 చిత్రాలతో రూపొందించిన మహావృక్షం చిత్రం, 1,296 సూక్ష్మ వినాయకులతో చిత్రం ఈ రికార్డును దక్కించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!