తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలకు 3 స్కోచ్ పురస్కారాలు

మెరుగైన పనితీరు కనబరిచిన తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలకు 3 స్కోచ్ పురస్కారాలు దక్కాయి. దిల్లీలో 2019 నవంబర్ 29న నిర్వహించిన కార్యక్రమంలో స్కోచ్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా ఆ సంస్థల అధికారులు పురస్కారాలు స్వీకరించారు. డ్యాష్‌బోర్డు, ఈ-కార్యాలయం నిర్వహణకు జెన్కోకు, సరఫరాసమస్యలనుంచి ఉపశమనం కల్పించినందుకు ట్రాన్స్‌కోకు ఈపురస్కారాలు దక్కాయి.