Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
తస్నిమ్‌కు ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ – Success Secret

తస్నిమ్‌కు ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌

భారత అమ్మాయి తస్నిమ్‌ మీర్‌కు ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ లభించింది. అండర్‌-15 బాలికల సింగిల్స్‌ విభాగంలో తస్నిమ్‌ మీర్‌ విజేతగా అవతరించింది. ఇండోనేసియాలోని సురబాయలో 2019 డిసెంబర్‌ 15న జరిగిన ఫైనల్లో తస్నిమ్‌ మీర్‌ 17-21, 21-11, 21-19తో భారత్‌కే చెందిన తారా షాపై విజయం సాధించింది. గుజరాత్‌కు చెందిన 13 ఏళ్ల తస్నిమ్‌ 2019 ఏడాది జనవరిలో ఖేలో ఇండియా గేమ్స్‌లో అండర్‌-17 సింగిల్స్‌ విభాగంలో స్వర్ణం నెగ్గింది. అలాగే 2018 ఏడాది ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి మేఘనరెడ్డితో కలిసి అండర్‌-15 డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!