Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు లైసెన్సులు తీసుకోవాలి – Success Secret

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు లైసెన్సులు తీసుకోవాలి

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందిన డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల సేవల్ని మాత్రమే థియేటర్లు పొందాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ 2019 డిసెంబర్‌ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివద్ధి సంస్థ (ఏపీఎఫ్‌టీవీటీడీసీ) ఇచ్చే వివిధ చిత్రాలను డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లు ఎంత సమయం, ఎంత నిడివితో ప్రదర్శిస్తున్నాయో పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లైసెన్సింగ్‌ అథారిటీగా వ్యవహరించే జాయింట్‌ కలెక్టర్‌ లేదా పోలీసు కమిషనర్‌… ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!