గ్రే లిస్టులోనే పాకిస్తాన్‌: FATF

ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్‌’లోనే కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) 2020 ఫిబ్రవరి 21న ప్రకటించింది. 2020, జూన్‌లోపు FATF ఆదేశాలను అమలు చేయకపోతే వాణిజ్యపరమైన పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాక్‌ను హెచ్చరించింది. భారత్‌లో పలు ఉగ్రదాడులకు కారణమైన సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు 27 చర్యలు చేపట్టాలని ఆదేశించినా పాకిస్తాన్‌ వాటిల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసిందని గుర్తు చేసింది.
పాకిస్థాన్‌ గ్రే లిస్టులో కొనసాగితే EU, IMF, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందడం కష్టమవుతుంది. FATFలో 39 సభ్య దేశాలు ఉన్నాయి. గ్రే లిస్ట్‌ నుంచి తప్పించుకొని, వైట్‌లిస్ట్‌కు చేరుకోవడానికి పాక్‌కు 12 దేశాల మద్దతు అవసరం.
FATF-Financial Action Task Force
Headquarters: Paris, France
Founded: July 1989
Membership: 39
President: Xiangmin Liu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!