Deprecated: Function create_function() is deprecated in /var/www/wp-content/plugins/youtube-channel-gallery/youtube-channel-gallery.php on line 1223
గ్యాస్‌ ఇంజిన్లలో ధ్వని నియంత్రణ మార్గం కనుగొన్న ఐఐటీ-ఎం బృందం – Success Secret

గ్యాస్‌ ఇంజిన్లలో ధ్వని నియంత్రణ మార్గం కనుగొన్న ఐఐటీ-ఎం బృందం

గ్యాస్‌ ఇంజిన్ల నుంచి వచ్చే భారీ ధ్వనులను నియంత్రించే మార్గాన్ని ఐఐటీ మద్రాసుకు చెందిన ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.ఐ.సుజిత్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం కనుగొంది. విద్యుత్తు ప్లాంట్లు, విమాన ఇంజిన్లలో ఉపయోగించే కొన్ని రకాల సాధారణ గ్యాస్‌ టర్బైన్లలో సంభవించే అవాంఛనీయ శబ్దాలు వాటి పరిసరాల్లో ఉన్నవారిని ఆందోళనకు గురిచేస్తుంటాయని ఐఐటీ పరిశోధకులు పేర్కొన్నారు. వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా టర్బైన్‌ పరిశ్రమ సంవత్సరానికి లక్ష కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు తెలిపారు. ఉపగ్రహ ప్రయోగాలకు ఉపయోగించే ప్రారంభ జనరేషన్‌ రాకెట్ల థర్మోఎకోస్టిక్‌ డోలనం కారణంగా అంతరిక్ష ప్రయోగాలు విఫలమవుతున్నాయని వారు అంచనా వేస్తున్నారు. పెద్ద ధ్వనులు ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను ప్రభావితం చేస్తాయని, ఈ కారణంగా నష్టం సంభవిస్తోందని వారు వెల్లడించారు. ఇందుకు విరుగుడుగా ధ్వనుల నియంత్రణకు కొత్తమార్గాన్ని అన్వేషించినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *