విశ్వంలో అంతుచిక్కని కృష్ణ పదార్థం (డార్క్‌ మ్యాటర్‌) ఉనికిపై ఉన్న సందేహాలను శాస్త్రవేత్తలు పటాపంచలు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన సిద్ధాంతాలను కొట్టిపారేశారు. కృష్ణ పదార్థం ఉనికిని నిర్ధరించారు. విశ్వం విస్తరణ నుంచి గెలాక్సీల్లోని నక్షత్రాల కదలికల వరకూ అనేక అంశాల తీరుతెన్నులను సాధారణ పదార్థం వివరించడం లేదు. దీంతో గుర్తించడానికి వీల్లేని కృష్ణ పదార్థం ఉనికిపై ఒక సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. విశ్వంలోని మొత్తం పదార్థంలో దీని వాటా 90 శాతం మేర ఉంటుందని అంచనా. అయితే దీని ఉనికిపై ఇప్పటివరకూ పరోక్ష ఆధారాలే దొరికాయి.