అమరావతి స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు రద్దు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును పరస్పర అంగీకారంతో రద్దు చేసుకుంటున్నట్టు సింగపూర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు 2019 నవంబర్ 12న ప్రకటించాయి. అమరావతి అభివృద్ధికి ఒక చుక్కానిలా, చోదక శక్తిగా పని చేస్తుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టింది. రాజధానిలో సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (సీబీడీ)గా ఎంపిక చేసిన ప్రాంతంలో 1,691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్షియంను…

Read More

ఈయన మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేసినట్టో..!

కేంద్ర మంత్రి సావంత్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదంశివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అరవింద్‌ గణపత్‌ సావంత్‌ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు ఆ శాఖను అదనపు బాధ్యతగా అప్పగించారు. మహారాష్ట్రలో భాజపా-శివసేన మధ్య సయోధ్య కుదరకపోవడంతో సావంత్‌ రాజీనామా చేశారు.

Read More

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన మొదలైంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవకాశం లేదని పేర్కొంటూ గవర్నర్‌ పంపిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం అక్కడి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచింది. ప్రభుత్వ ఏర్పాటుకోసం 2019 నవంబర్ 12 రాత్రి 8.30 వరకు ఎన్‌సీపీకి సమయం ఇచ్చిన గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ.. మధ్యాహ్నం 12 గంటలకే కేంద్ర ప్రభుత్వానికి 18 పేజీల నివేదిక పంపించారు. కేంద్ర కేబినెట్‌ సమావేశమై ఆయన నివేదిక ఆధారంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సూచిస్తూ…

Read More

సాలీడుకు సచిన్‌ టెండుల్కర్‌ పేరు

గుజరాత్‌ ఎకొలాజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చి(జీర్‌)కు చెందిన పరిశోధకుడు ధృవ్‌ ప్రజాపతి తాను కొత్తగా కనుగొన్న ఓ జాతి సాలీడుకు భారత క్రికెటర్ సచిన్‌ టెండుల్కర్‌ పేరు పెట్టారు. ఆయనతో పాటు పరిశోధనలు సాగిస్తున్న మరో శాస్త్రవేత్త మరో సాలీడు జాతిని కొత్తగా కనుగొన్నప్పటికీ అందుకు సంబంధించిన విస్తృత పరిశోధన అంతా కూడా ప్రజాపతే సాగించారు. కేరళలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన సెయింట్‌ కురియకోస్‌ ఎలియాస్‌ ఛవరపటేర పేరు దానికి పెట్టారు. ఒక జాతి సాలీడు…

Read More

మారిషస్‌ ప్రధానిగా ప్రవిండ్‌ జగన్నాథ్‌

మారిషస్‌ ప్రధానిగా ప్రవిండ్‌ జగన్నాథ్‌(57) 2019 నవంబర్ 12న ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడు బెర్లెన్‌వ్యాపురి అధికారిక నివాసంలో జగన్నాథ్‌ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని సంకీర్ణం విజయం సాధించింది. Capital: Port LouisOther languages Currency: Mauritian rupee

Read More